భువనగిరి, అక్టోబర్ 26: నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలో జరిగిన పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నల్లగొండ గడ్డపై జరిగే ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా సుమారు 2,000 మంది రైతు ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
రైతులు పండించే వరి, పత్తి, మిర్చి, పండ్లు, కూరగాయలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. వాతావరణ మార్పులతో నష్టపోతున్న రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని, ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, కార్యవర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి