కృష్ణాష్టమి, బోనాల పండుగ దసరా నుంచి వరుస విషాదాలు.. శాంతి పూజలు చేయాలంటూ స్థానికుల చర్చలు.
చిట్యాల: పట్టణంలో వరుసగా చోటుచేసుకుంటున్న మరణాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. కృష్ణాష్టమి, బోనాల పండుగల సమయం నుంచి పలువురు మృత్యువాత పడుతుండటంతో స్థానికుల్లో ఈ చర్చ మొదలైంది. కొందరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఇతర కారణాలతో ఆకస్మికంగా మరణిస్తుండటం ప్రజలను కలచివేస్తోంది.ఒకరి మరణవార్త మరువకముందే మరో విషాద ఘటన వెలుగుచూస్తుండటంతో పట్టణవాసుల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా పండుగల సమయం నుంచి మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయనే భావనతో కొందరు స్థానికులు ఈ ఘటనలను పండుగ ముహూర్తాలతో ముడిపెడుతున్నారు. దీంతో పట్టణంలో శాంతి పూజలు నిర్వహించాలని కోరుతూ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పెడుతున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి