రైతులు, వ్యాపారులు గమనించాలి: చౌటుప్పల్ మండలంలో కొత్త ప్రాంతానికి మారిన విక్రయాలు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ మండలంలో క్రమం తప్పకుండా జరిగే గొర్రెలు, మేకల సంత ప్రాంతంలో మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇకపై ప్రతి ఆదివారం వలిగొండ రోడ్డులోని రైతు వేదిక సమీపంలో గొర్రెల, మేకల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగనున్నాయి.మండల పరిధిలోని రైతులు, పెంపకందారులు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ మార్పును గమనించాలని కోరారు. నిర్దేశిత స్థలంలో విక్రయాలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, లావాదేవీల కోసం వచ్చేవారు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి