Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

వీబీజీ రాంజీ పథకం కింద పశువుల తొట్టి నిర్మాణానికి శ్రీకారం

Updated : 11 Nov 2026 12:03 IST
As Preferred Source 1 min read
వీబీజీ రాంజీ పథకం కింద పశువుల తొట్టి నిర్మాణానికి శ్రీకారం

సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో ముగ్గు పోత.


స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో వీబీజీ రాంజీ పథకం కింద పశువుల తొట్టి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో పనుల ప్రారంభానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో పశువుల తొట్టి నిర్మాణం కోసం ముగ్గు పోశారు.

గ్రామంలోని పశువులకు నీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు తొట్టి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, ఈసీ ప్రవీణ్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్స్ భాగ్యమ్మ, నాయకులు కొండ భీమయ్య,కొండమల్లయ్య, వీరమల్ల బిక్షం, కొండ లింగయ్య, వర్కల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వీబీజీ రాంజీ పథకం కింద పశువుల తొట్టి నిర్మాణానికి శ్రీకారం

Article Image

సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో ముగ్గు పోత.


స్థానికం ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో వీబీజీ రాంజీ పథకం కింద పశువుల తొట్టి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో పనుల ప్రారంభానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఆధ్వర్యంలో పశువుల తొట్టి నిర్మాణం కోసం ముగ్గు పోశారు.

గ్రామంలోని పశువులకు నీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు తొట్టి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, ఈసీ ప్రవీణ్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్స్ భాగ్యమ్మ, నాయకులు కొండ భీమయ్య,కొండమల్లయ్య, వీరమల్ల బిక్షం, కొండ లింగయ్య, వర్కల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి