యాదగిరిగుట్టకు చెందిన ముఖేష్‌గా గుర్తింపు.. రైల్వే పోలీసుల దర్యాప్తు.
యాదాద్రి భువనగిరి: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భువనగిరి మండలం పగిడిపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని యాదగిరిగుట్టకు చెందిన ముఖేష్‌గా గుర్తించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి రైలు కిందపడి ముఖేష్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తుండటంతో పాటు, గత పదేళ్లుగా యాదగిరిగుట్ట కొండపైన ఉన్న లడ్డూ విక్రయశాల టికెట్ కౌంటర్‌లోనూ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ముఖేష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే ఆయన మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి