35 వార్డుల్లో సభ్యత్వ నమోదు, కుటుంబ సర్వేకు తీర్మానం.
సభ్యత్వాల అనంతరం పట్టణ కమిటీ ఎన్నికలు.
భువనగిరి, నవంబర్ 11: స్థానికం ప్రతినిధి
భువనగిరి పట్టణంలో ముదిరాజ్‌ల ఐక్యతను చాటుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డులకు చెందిన ముదిరాజ్‌లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సాయిబాబా గుడి నుంచి వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా సాగారు. అనంతరం వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో ముదిరాజ్‌ల ముఖ్య సమావేశం నిర్వహించారు.
సంఘటిత శక్తికి శ్రీకారం..
ముదిరాజ్ సమన్వయ కమిటీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డుల్లో సభ్యత్వ నమోదు చేపట్టాలని, ప్రతి ముదిరాజ్ కుటుంబం వివరాలను సేకరించేలా కుటుంబ సర్వే నిర్వహించాలని తీర్మానించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం పట్టణ ముదిరాజ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
సంఘం బలోపేతమే లక్ష్యం..
పట్టణంలోని అన్ని వార్డుల ముదిరాజ్ కుటుంబాలను సంఘం పరిధిలోకి తీసుకువచ్చి, ఐక్యతతో ముందుకు సాగేందుకు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. సభ్యత్వ నమోదు, కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించి తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు మంద యాదగిరి, కొల్పుల కమలాకర్, దిడ్డికాడి నర్సింగ్‌రావు, నాయిని పూర్ణచందర్, వల్దాసు సుదర్శన్, మున్సిపల్ కౌన్సిలర్లు గుర్రాల సంతోష్ శ్రీనివాస్, తుమ్మల యాస్మిన్ నగేష్, జంగిటి వినోద్, కూర వెంకటేష్, యాట వెంకటేష్, సాధు రామకృష్ణ, గీస ఆనంద్‌తో పాటు 35 వార్డుల ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి