Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఐటీఐ విద్యార్థులకు ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగావకాశాలు

Updated : 11 Nov 2026 07:23 IST
As Preferred Source 1 min read
ఐటీఐ విద్యార్థులకు ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగావకాశాలు

ఉద్యోగంతో పాటు డిప్లొమా, అప్రెంటిస్ సర్టిఫికెట్లు పొందే అవకాశం.

భువనగిరి: స్థానికం ప్రతినిధి

ఐటీఐ విద్యార్థులకు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్‌సీ)లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధార్థ, శివసాయి ఐటీఐ కళాశాలలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 16న తుక్కుగూడలోని ఎంఎన్‌సీ కంపెనీ ప్రతినిధులు కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఈ ఉద్యోగ నియామకాల ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉపాధితో పాటు విద్యాభ్యాసాన్ని కొనసాగించే అవకాశం కూడా కల్పించనున్నారు. ఉద్యోగం చేస్తూనే డిప్లొమా పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు డిప్లొమా సర్టిఫికెట్, అప్రెంటిస్ సర్టిఫికెట్ అందించనున్నట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.

ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.15,500, రెండో సంవత్సరం రూ.18,000, మూడో సంవత్సరం రూ.22,000 వేతనం చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ అనుభవంతో పాటు ఉన్నత విద్యార్హతలు పొందేందుకు అవకాశం లభించనుంది.

ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగంతో పాటు విద్యారంగంలోనూ అభివృద్ధి సాధించి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది.

Sthanikam

ఐటీఐ విద్యార్థులకు ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగావకాశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి