కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత.
రామన్నపేట, నవంబర్ 23: స్థానికం ప్రతినిధి:
రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన వీఆర్ఏ పిట్టల సత్తయ్య (75) మృతి చెందారు. ఆయన మృతి పట్ల తహశీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి సంతాపం వ్యక్తం చేశారు. సత్తయ్య మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంత్యక్రియల నిర్వహణ నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ శోభ, జీపీఓ అనిత, నరసింహ, ఇతర వీఆర్ఏలు, గ్రామస్థులు పాల్గొని సత్తయ్య మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి