Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పీపలపహాడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

Updated : 23 Nov 2026 18:12 IST
As Preferred Source 1 min read
పీపలపహాడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ముఖ్యమంత్రిగా కె. విఘ్నేష్, ప్రధానోపాధ్యాయురాలిగా పూజిత బాధ్యతలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

పీపలపహాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ఉన్నతాధికారులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు.​ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి పాత్రలో కె. విఘ్నేష్, ప్రధానోపాధ్యాయురాలి గా పూజిత, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా సాయి ప్రసన్న, మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో)గా లక్ష్మీప్రసన్న వ్యవహరించారు. మిగిలిన విద్యార్థులందరూ వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి ఆకట్టుకున్నారు.​విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ పేర్కొన్నారు. వివిధ పాత్రల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

పీపలపహాడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి