Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కార్మిక హక్కుల కోసం ఢిల్లీని ఆక్రమించండి.

Updated : 23 Nov 2026 18:34 IST
As Preferred Source 1 min read
కార్మిక హక్కుల కోసం ఢిల్లీని ఆక్రమించండి.

డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే ఆందోళనను విజయవంతం చేయాలి.

కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: సీఐటీయూ నేత కల్లూరి మల్లేశం.

పెద్దకందుకూరు, నవంబర్ 23: స్థానికం ప్రతినిధి:

కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న 'ఢిల్లీని ఆక్రమించండి' (ఆక్యుపై ఢిల్లీ) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ ఆల్ ఇండియా కౌన్సిల్ సభ్యుడు, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ సమావేశం అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మికులు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటు, సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కులను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు.

ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచేలా చర్యలు తీసుకుంటూ కార్మికుల శ్రమను దోచుకునే విధానాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయకుండా ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని అన్నారు.

కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలి

కార్మికులందరికీ నెలకు రూ.42 వేల కనీస వేతనం, రూ.21 వేల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఆక్యుపై ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ జనరల్ సెక్రటరీ సీహెచ్ రమేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు జె. వెంకటేష్, పి. గణేష్, నగేష్, సురేందర్, స్వామి, శ్రీనివాస్ రెడ్డి, గంగయ్య, నరేష్, సురేష్, ఐలయ్య, అన్నపూర్ణ, లలిత, సులోచన, రఫీ, ప్రణీత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక హక్కుల కోసం ఢిల్లీని ఆక్రమించండి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి