రాచకొండ అటవీ తేనె అందజేత
కిసాన్ దివస్‌కు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానం
యాదాద్రి భువనగిరి, నవంబర్ 23: స్థానికం ప్రతినిధి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ (APC) కె. సురేంద్ర మోహన్, ఐఏఎస్‌కు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రమణారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆయనను సన్మానించారు.
ఈ సందర్భంగా మిత్ర (MITHRA) ఫౌండేషన్ అధ్యక్షుడు నిమ్మల రామచంద్రయ్య, నోముల మాధవరెడ్డి, సుక్క స్వామితో కలిసి రాచకొండ అటవీ ప్రాంతానికి ప్రత్యేకమైన సహజ సిద్ధమైన అటవీ తేనెను సురేంద్ర మోహన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో అమలవుతున్న జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) కార్యక్రమంలో భాగంగా CRPలు, బయో రిసోర్స్ ఇన్‌పుట్ సెంటర్ల (BRCs)కు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అలాగే డిసెంబర్ 23న MITHRA ఫౌండేషన్ ఫార్మ్‌లో నిర్వహించనున్న కిసాన్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు.
ఈ ఆహ్వానంపై కె. సురేంద్ర మోహన్ సానుకూలంగా స్పందించారు. రైతులకు మేలు చేకూర్చే ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు, కిసాన్ దివస్ నిర్వహణపై నిర్వాహకులు ఆయనకు వివరించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి