Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ప్రతి కుటుంబానికి జీవిత బీమా భరోసా.

Updated : 23 Nov 2026 18:12 IST
As Preferred Source 1 min read
ప్రతి కుటుంబానికి జీవిత బీమా భరోసా.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి.

రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం బీమా చేయించుకోవాలి : సర్పంచుల పిలుపు.

రామన్నపేట, నవంబర్ 23: స్థానికం ప్రతినిధి:

ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిరిపురం, నిదానపల్లి గ్రామాల సర్పంచులు నారపాక మాధవి యాదయ్య, అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబం బీమా పరిధిలోకి రావాలని పిలుపునిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం, నిదానపల్లి గ్రామాల్లో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన పోస్టర్లను సర్పంచులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా జీవిత బీమా చేయించుకోవాలని కోరారు. కుటుంబ పెద్దకు అనుకోని ఆపద ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో బీమా కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంపై గ్రామస్థులకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలా చూడాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు.. పంచాయతీ కార్యదర్శులు ఎం. జ్యోతి, సుమన్, ఉప సర్పంచులు కొండ నడిపి మల్లయ్య, మూడుదుడ్ల అనూష రమేష్, నాయకులు పున్న వెంకటేశం, గాదె యాదగిరి, సంగిశెట్టి మహేష్, కడారి బుక్షమయ్య, కడారి వెంకటయ్య, వీరమల్ల వీరేశం, ఆగు మల్లయ్య, వర్కల సూరజ్, కడారి శీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి కుటుంబానికి జీవిత బీమా భరోసా.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి