Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అయ్యప్ప భక్తులకు చౌటుప్పల్ ఆర్డీవో దంపతుల అన్నప్రసాద వితరణ

Updated : 23 Nov 2026 16:58 IST
As Preferred Source 1 min read
అయ్యప్ప భక్తులకు చౌటుప్పల్ ఆర్డీవో దంపతుల అన్నప్రసాద వితరణ

​సంకల్ప బలంతో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి- ఆర్డీవో వెలమ శేఖర్ రెడ్డి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) వెలమ శేఖర్ రెడ్డి, సుజాత దంపతులు అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.​ఈ సందర్భంగా ఆర్డీవో శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని, దుర్వ్యసనాలకు దూరంగా ఉండేందుకు సంకల్ప బలాన్ని పెంచుకోవాలని సూచించారు. సాధారణంగా మానవుల మనస్సు అనేక కోరికల వైపు పరుగులు తీస్తుందని, అంతరాత్మను సరైన మార్గంలో నడిపించుకునే శక్తిని అయ్యప్ప స్వామి ప్రసాదిస్తారని పేర్కొన్నారు. దీక్ష ద్వారా లభించే ఆ శక్తిని నిలబెట్టుకుని వ్యక్తిగత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గత కొన్నేళ్లుగా దేవాలయంలో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.​ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి గురుస్వామి, వ్యవస్థాపక అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, మాజీ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తూర్పాటి శంకర్ గురుస్వామి, ఉప్పు ఆంజనేయులు గురుస్వామి, కంచరకుంట్ల వెంకట్ రెడ్డి గురుస్వామి, తాడూరి పరమేష్ గురుస్వామి, బోరం రాజశేఖర్ రెడ్డి గురుస్వామి, పెద్దగోని రమేష్ గౌడ్ గురుస్వామి, బొడిగె బాలకృష్ణ గౌడ్ స్వామి, గుత్తికొండ సుధీర్ గురుస్వామి, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి కన్నెస్వామి, పాశం కృష్ణ గురుస్వామి, సుక్క సుదర్శన్ గురుస్వామి, మలిగే శ్రీను గురుస్వామి, ఉష్కాగుల నాగరాజు స్వామి, బండమీది మల్లేష్ కన్నెస్వామి, కేతరాజు మహేష్ స్వామి, బొడ్డు రాజేందర్ రెడ్డి, పాలమాకుల అశోక్ స్వామి, బాలగోని మల్లేష్ గౌడ్ స్వామి, బొబ్బిళ్ళ సామ్రాట్ స్వామి, ఇమ్మడి ఈశ్వర్ స్వామి, ఓర్సు రాజు స్వామి, బాలగోని రామ లక్ష్మణ్ స్వాములు, చిన్ని కృష్ణ స్వామి, సంపత్ స్వామి, బోరం దయాకర్ రెడ్డి స్వామి, బోరం శేఖర్ రెడ్డి కన్నెస్వామి తదితర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప భక్తులకు చౌటుప్పల్ ఆర్డీవో దంపతుల అన్నప్రసాద వితరణ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి