అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో గల శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో సోమవారం అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నప్రసాద వితరణ ప్రారంభం అయింది. గత 15 ఏళ్లుగా ఆలయంలో స్వాములకు కార్తీకమాసంలో ప్రారంభించి 41 రోజులపాటు అన్న ప్రసాద వితరణ జరపడం ఆనవాయితీగా వస్తుంది దాతల సహకారంతో కొనసాగుతున్న ఈ అన్న ప్రసాద వితరణ ఈ ఏడు కూడా సోమవారం నాడు ప్రారంభం అయింది ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు గాజుల నవీన్ బోయిన గోపాల్ రంజాన్ పల్లి సౌజన్యంతో అన్న ప్రసాద వితరణ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్ కులకర్ణి కోశాధికారి బంధం కిషోర్ గుప్తా ప్రధాన కార్యదర్శి పులుగు గోపాల్ సహాయ కార్యదర్శి రంగంపేట రాజు ముదిరాజ్,
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి,మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం జగన్ మోహన్ రెడ్డి,
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఎం మల్లికార్జున గుప్తా, డి బి నాగభూషణం మాజీ ఎంపీపీ అధ్యక్షుడు హెచ్ రామా గౌడ్, కౌన్సిలర్లు రాజశేఖర్, పట్లోళ్ల శ్రీనివాస్, తోట్ల రామకృష్ణ, నాయకులు సారా శ్రీధర్ మల్లే శ్రీకాంత్ కొరబోయిన నాగరాజు శ్రీనివాస్ యాదవ్ డేవిడ్ సారా శివకుమార్ సురోత్తం రెడ్డి చాపల వెంకటేశం కౌశిక సత్యం గాజుల అనిల్ గాజుల రవి గాజుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి