అల్లాదుర్గం మండలంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయంపై అధికారులను రైతులు నిలదీయగా.. అల్లాదుర్గం గ్రామం పేరుతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన జాబితా పైస్థాయి నుంచి రాలేదని, జాబితా రాకుండా తాము కొనుగోళ్లు ఎలా చేపట్టగలమని అధికారులు సమాధానం ఇస్తున్నట్లు రైతులు తెలిపారు.ఇప్పటికే ధాన్యంలో తేమ శాతం సరిపడి పది రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగకపోవడం, మూడుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం ప్రజావాణిలో రైతులంతా కలిసి వినతిపత్రం అందజేశారు. పైస్థాయి అధికారుల నుంచి అనుమతులు, జాబితాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే సమస్యను పరిష్కరించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు!
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి