Sthanikam - Truth Matters
Logo

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి ఏఈఓ గాయత్రీ

Updated : 23 Nov 2026 16:58 IST
As Preferred Source 1 min read
ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి ఏఈఓ గాయత్రీ

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి ఏఈఓ గాయత్రీ

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరియు ఎల్నినో (El Niño) ప్రభావం కారణంగా ఈ యాసంగి సీజన్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉన్నందున దీనివల్ల భూగర్భ జలాలు, బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చు.కావున రైతు సోదరులు ఈ యాసంగి సీజన్లో వరి నారుమడులు పోయవద్దని మరియు వరి సాగుకు సిద్ధం కావద్దని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలైన శనగ, కుసుమ, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న మరియు ఇతర ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యతఇవ్వాలి.అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ, పంట మార్పిడి విధానాలను పాటించి, సాగు ఖర్చులు తగ్గించుకొని రైతులు నష్టాల బారిన పడకుండా ఉండాలని వ్యవసాయ శాఖ ఏఈఓ గాయత్రి సోమవారం నాడు బొమ్మ రెడ్డి గూడెం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో అన్నారు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని రైతులకు తెలియజేశారునీటి పొదుపు – ప్రత్యామ్నాయ పంటల సాగు రైతుకు లాభదాయకమ్మన్నారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్ పంచాయతీ కార్యదర్శి అలేఖ్య, వార్డు సభ్యులు గోపాల్, సుభాష్,గణపతి నాయక్, గ్రామ సమైక్య సంఘం అధ్యక్షురాలు మాజీ ఎంపీటీసీ సుదర్శన్ రాజ్ కుమార్, నేనావత్ సురేష్,అరుణ్,కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి ఏఈఓ గాయత్రీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి