Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

Updated : 23 Nov 2026 18:43 IST
As Preferred Source 1 min read
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

స్వచ్ఛతకు శ్రీకారం.. గౌరవప్రదమైన భవిష్యత్తుకు బాటలు

తాజ్‌పూర్‌లో స్వచ్ఛ శౌచాలయ కార్యక్రమం ప్రారంభం

తాజ్‌పూర్, నవంబర్ 23: స్థానికం ప్రతినిధి

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరిచి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా స్వచ్ఛ శౌచాలయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తాజ్‌పూర్ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ శౌచాలయం – గౌరవప్రదమైన భవిష్యత్తు' కార్యక్రమాన్ని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో ప్రారంభించారు.

నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు మరుగుదొడ్ల వినియోగం, వాటి ప్రాధాన్యత, పరిశుభ్రత నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. గ్రామంలోని సామూహిక మరుగుదొడ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్ల నిర్వహణ, శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన మరుగుదొడ్ల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పారిశుధ్య నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి