Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి

Updated : 23 Nov 2026 18:38 IST
As Preferred Source 1 min read
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి

బీజేపీ, బీఆర్ఎస్‌లపై మధుయాష్కి గౌడ్ విమర్శలు

కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 23: స్థానికం ప్రతినిధి

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఎన్నికల్లో ముందుకు వస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం హయత్‌నగర్ టీ-నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన సామ రామ్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని తెలిపారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి మద్దతుగా పనిచేయాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ వ్యూహాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తినని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఇంటి మనిషిగా, బిడ్డగా, తమ్ముడిగా భావించి మద్దతు ఇవ్వాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీనియర్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్, బానోతు సుజాత నాయక్ తదితరులు మాట్లాడారు.

ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు, జిల్లా కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి