Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:10 AM

వెల్లంకిలో కాంగ్రెస్‌కు షాక్,దూసుకుపోయిన కారు

15-12-2025 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హోరాహోరీ పోరులో BRS దూసుకుపోయింది

రామన్నపేట (మ): వెల్లంకి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠకు దారి తీశాయి. చివరకు ప్రజల తీర్పు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గంజి భార్గవి భాస్కర్‌ను ఓటర్లు తిరస్కరించగా, BRS బలపరిచిన ఈడెం రాధ శ్రీనివాస్ ఘన విజయం సాధించారు.

ఎన్నికల బరిలో కాంగ్రెస్‌కు CPM, TDP పార్టీల మద్దతు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఓటింగ్ ముగిసిన నాటి నుంచే ఉత్కంఠ నెలకొనగా, కౌంటింగ్‌లో BRS ఆధిక్యం స్పష్టంగా బయటపడింది.

గ్రామంలో అభివృద్ధి హామీలు, స్థానిక సమస్యలపై నిలకడైన వైఖరే BRSకు అనుకూలంగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వెల్లంకి ఫలితంతో రామన్నపేట మండలంలో కాంగ్రెస్ బలహీనత మరోసారి బట్టబయలైంది.

ఈ విజయం BRS శ్రేణులకు ఉత్సాహాన్నివ్వగా, ప్రత్యర్థి వర్గాల్లో నిరాశ ముసిరింది. మండల రాజకీయాల్లో BRS దూకుడు కొనసాగుతుందన్న సంకేతంగా ఈ ఫలితం మారిందన్న చర్చ జోరందుకుంది.

Sthanikam

వెల్లంకిలో కాంగ్రెస్‌కు షాక్,దూసుకుపోయిన కారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News