Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ఉపాధి హామీ పనులపై సబ్‌ కలెక్టర్ సమీక్ష సమావేశం

Updated : 23 Oct 2026 18:48 IST
As Preferred Source 1 min read
ఉపాధి హామీ పనులపై సబ్‌ కలెక్టర్ సమీక్ష సమావేశం

ఉపాధి హామీ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి: సబ్‌ కలెక్టర్ ఉమా హారతి

నారాయణఖేడ్ సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్‌ కలెక్టర్ ఎన్. ఉమా హారతి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బాలరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కల్హేర్, నిజాంపేట్, సిర్గాపూర్ మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు, ఈసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతి, పనుల నిర్వహణ, కూలీలకు ఉపాధి కల్పన, గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలు వంటి అంశాలపై అధికారులు సమీక్షించారు. ఉపాధి హామీ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సబ్‌ కలెక్టర్ ఉమా హారతి అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. చేపట్టిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహిస్తూ, వాటి అమలులో పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని సబ్‌ కలెక్టర్ ఎన్. ఉమా హారతి, అదనపు డీఆర్‌డీఓ బాలరాజ్ సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత మండలాల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పనులపై సబ్‌ కలెక్టర్ సమీక్ష సమావేశం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి