Sthanikam - Truth Matters
Logo

జూలై వరకు తాగునీటి కొరత రాకుండా చర్యలు!

Updated : 23 Oct 2026 18:35 IST
As Preferred Source 1 min read
జూలై వరకు తాగునీటి కొరత రాకుండా చర్యలు!

ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించాలి...

నీటి వృథా లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి కలెక్టర్ చంద్రశేఖర్...

దేవరకొండ : ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ సూచించారు. రానున్న పది నెలలపాటు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు పిలుపునిచ్చారు. పైపులైన్ల లీకేజీలను అరికట్టి, నీటి వృథా లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. శుక్రవారం దేవరకొండలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత కీలకమన్నారు.

నీటి వనరులపై ఆడిట్‌ నిర్వహించాలి...

గ్రామాల్లోని చెరువులు, మిషన్‌ భగీరథ, బోర్లు, కాలువలు, వర్షపు నీటి నిల్వలకు సంబంధించిన వివరాలను సేకరించి నీటి వనరులపై ఆడిట్‌ నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఎంత? రానున్న నెలల్లో అవసరాలు ఎంత? అనే అంశాలను అంచనా వేసి వినియోగ ప్రణాళిక రూపొందించాలన్నారు. వచ్చే ఏడాది జూలై వరకు నీటి కొరత ఏర్పడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణలో భాగంగా పైపులైన్ల లీకేజీలను తక్షణమే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. ఇంకుడు గుంతల నిర్మాణంతో వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, సాగునీటిని అవసరమైన మేరకే వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్తును సైతం పొదుపుగా వినియోగించి రానున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి...

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. సజ్జలు, జొన్నలు, మినుములు, కందులు వంటి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. సుమారు 30 మంది రైతులతో ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి సమష్టి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించాలని చెప్పారు. రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఉపాధి హామీ పనులను విస్తరించాలి...

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పనులను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. పశుసంపదను సంరక్షించడంతోపాటు పశువులకు తాగునీటి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని సూచించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల కొరత ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఎంపీడీవోలు పనుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. చేపట్టిన పనులకు కొలతల పుస్తకాల ఆధారంగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కొత్త పంచాయతీల్లో రేషన్‌ దుకాణాలు...

గ్రామీణ ప్రజలకు రేషన్‌ సరుకులు అందుబాటులో ఉండేలా కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో రేషన్‌ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల పరిష్కారానికి కూడా చర్యలు చేపడతామన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి, దాని ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సర్పంచులతో కలిసి సమస్యలపై చర్చ...

సదస్సు అనంతరం కలెక్టర్‌ సర్పంచులతో కలిసి కింద కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు, నీటి పొదుపుపై రూపొందించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావి, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌ కరణ్‌ రెడ్డి, ట్రైనీ సహాయ కలెక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్‌ కుమార్‌, పశుసంవర్ధక శాఖ అధికారి జి.వి. రమేష్‌, డీపీఓ తరుణ్‌ చక్రవర్తి, ఇన్‌ఛార్జి ఎంపీడీవో పార్వతి, అధికారులు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Sthanikam

జూలై వరకు తాగునీటి కొరత రాకుండా చర్యలు!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి