Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల పాత్ర కీలకం.. మీడియా మిత్రులకు జీఎంఆర్ ఫౌండేషన్ అండ

Updated : 23 Oct 2026 20:41 IST
As Preferred Source 1 min read
ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల పాత్ర కీలకం.. మీడియా మిత్రులకు జీఎంఆర్ ఫౌండేషన్ అండ

నారాయణఖేడ్ పట్టణంలో జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మీడియా మిత్రులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ స్వయంగా మీడియా మిత్రులకు బ్యాగులను అందజేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న పాత్రికేయులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాసేవతో పాటు పాత్రికేయులకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ అనుముల మారుతి, కంగ్టి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగారం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవరాజు పటేల్, నాయకులు తుకారాం తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ ముందుకు సాగుతోందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. పాత్రికేయుల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడం పట్ల మీడియా మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Sthanikam

ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల పాత్ర కీలకం.. మీడియా మిత్రులకు జీఎంఆర్ ఫౌండేషన్ అండ

Article Image

నారాయణఖేడ్ పట్టణంలో జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మీడియా మిత్రులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ స్వయంగా మీడియా మిత్రులకు బ్యాగులను అందజేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న పాత్రికేయులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాసేవతో పాటు పాత్రికేయులకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ అనుముల మారుతి, కంగ్టి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగారం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవరాజు పటేల్, నాయకులు తుకారాం తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ ముందుకు సాగుతోందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. పాత్రికేయుల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడం పట్ల మీడియా మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి