Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

Updated : 23 Oct 2026 19:47 IST
As Preferred Source 1 min read
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

తెలియని లింకులు, వీడియో కాల్స్ పట్ల జాగ్రత్త

మోసపోతే వెంటనే '1930'కి కాల్ చేయాలి: ఎస్హెచ్‌ఓ మన్మధ కుమార్

తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, విశ్రాంత ఉద్యోగులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్‌ఓ) జి. మన్మధ కుమార్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.​ప్రస్తుతం సమాజంలో ఫిషింగ్, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వ్యాపారాలు, డిజిటల్ అరెస్టేషన్లు, లోన్ యాప్‌లు, గుర్తింపు చౌర్యం వంటి సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఆన్‌లైన్ లింక్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని హెచ్చరించారు. ఒకవేళ పొరపాటున సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. పోలీస్ స్టేషన్ సైబర్ నేరాల విభాగం అధికారిణి మమత పలు ఉదాహరణలతో నేరాలు జరుగుతున్న తీరును వివరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు.​ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భీమిడి మోహన్ రెడ్డి అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి కానుగుల వెంకటయ్య స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ సదస్సులో జిల్లా సంఘ సభ్యులు బాతరాజు ఆగయ్య, కోశాధికారి బడుగు శ్రీరాములు, నారగోని కృష్ణయ్య గౌడ్, బిక్కు నాయక్, చొల్లేటి రాజయ్య, సీనియర్ సిటిజన్ ప్రధాన కార్యదర్శి గోశిక లక్ష్మయ్య, బొల్లారం లక్ష్మీనారాయణ, బొమ్మిడి సత్తిరెడ్డి, సిలివేరు కృష్ణ, కోణం వినోద, గోశిక మురళి, స్థానిక సీనియర్ సిటిజన్లు, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి