యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 23: శ్రీ ఆర్కే హాస్పిటల్‌పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఖండించింది. గత 24 గంటలుగా ప్రచారంలో ఉన్న అంశాలపై ఎలాంటి నిర్ధారణ లేకుండా స్పందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. హాస్పిటల్‌పై ఎవరైనా ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించింది. ఆధారాలు లేకుండా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహలు, ఆందోళనలు కలిగే అవకాశం ఉందని పేర్కొంది. హాస్పిటల్‌పై సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంబంధిత వాస్తవాలను పరిశీలించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సంస్థపై అవాస్తవ ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
ఆర్కే హాస్పిటల్‌పై అసత్య ప్రచారం నమ్మొద్దు. యాజమాన్యం విజ్ఞప్తి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి