Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కెమికల్స్ కంపెనీలో మహిళా కార్మికురాలి అనుమానాస్పద మృతి

Updated : 23 Oct 2026 21:15 IST
As Preferred Source 1 min read
కెమికల్స్ కంపెనీలో మహిళా కార్మికురాలి అనుమానాస్పద మృతి

విధి నిర్వహణలో స్పృహతప్పి పడిపోయిన స్వప్న

ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వెల్లడి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

దేవలమ్మ నాగారం స్థానిక భాస్కర్ ఆగ్రో కెమికల్స్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా కార్మికురాలు విధి నిర్వహణలో అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయి మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన ఏచూరి స్వప్న (40) స్థానిక భాస్కర్ ఆగ్రో కెమికల్స్ కంపెనీలో కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. శుక్రవారం (23-10-2026) ఉదయం యథావిధిగా కంపెనీలో పనికి వెళ్లిన ఆమె, ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది.​ఈ విషయమై కంపెనీకి చెందిన శ్రీను అనే వ్యక్తి మృతురాలి భర్త ఏచూరి కృష్ణ (56)కు సమాచారం అందించాడు. హుటాహుటిన కంపెనీ వద్దకు చేరుకున్న భర్త, స్పృహలేకుండా ఉన్న స్వప్నను ప్రైవేటు వాహనంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మరోజు ఆసుపత్రికి తరలించాడు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.తన భార్య అకాల మరణానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి భర్త కృష్ణ పోలీసులను కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

కెమికల్స్ కంపెనీలో మహిళా కార్మికురాలి అనుమానాస్పద మృతి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి