రామన్నపేట అక్టోబర్ 23 స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చేగూరి శివమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, వెల్లంకి గ్రామ మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి అండగా నిలిచారు. శివమ్మ మృతి విషయం తెలుసుకున్న ఆయన ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి