Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:58 AM

ఉక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీసుల ఉక్కుపాదం

12-03-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రూ.15 వేల విలువైన ఉక్కా స్వాధీనం – ముగ్గురిపై కేసులు నమోదు

సూర్యాపేట పట్టణంలో అక్రమంగా ఉక్కా అమ్మకాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాలను హానికలిగించే ఇలాంటి వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసు అధికారి కె. నరసింహ హెచ్చరించారు.

నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు ప్రధాన వీధిలోని కొన్ని వస్త్ర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్.వి ఫ్యాషన్స్, ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్స్ అనే వస్త్ర దుకాణాల్లో అక్రమంగా ఉక్కా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. తనిఖీలలో భాగంగా సుమారు రూ.15 వేల విలువైన ఉక్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీసు అధికారి కె. నరసింహ తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను హరించే ఇలాంటి వ్యాపారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఉక్కా సేవించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు పడతాయని, ముఖ్యంగా యువత ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఎక్కడైనా ఇలాంటి అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిసిన పక్షంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Sthanikam

ఉక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీసుల ఉక్కుపాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News