Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ఉగాది వేడుకల్లో ఐపీఎస్ అధికారికి ఘన సత్కారం

19-03-2026 223 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు

తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవస్థానం లో శుభకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, లింగారెడ్డిగూడెం వాస్తవ్యులైన ఐపీఎస్ అధికారి సురకంటి శేషాద్రి రెడ్డి ని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలను ప్రశంసించారు.దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, ఐక్యత తీసుకురావాలని ఆకాంక్షించారు. ఐపీఎస్ అధికారి శేషాద్రి రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఉగాది వేడుకల్లో ఐపీఎస్ అధికారికి ఘన సత్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News