Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

ఉద్యమకారుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది – పెద్దగోని రమేష్ గౌడ్

23-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉద్యమకారుల సంక్షేమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాల ఫలితమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు పెద్దగోని రమేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుల సంక్షేమంపై చేసిన ప్రకటనను ఉద్యమకారుల తరఫున హర్షిస్తున్నామని తెలిపారు.

ఉద్యమంలో భాగస్వాములైన వారికి 250 గజాల స్థలాలు కేటాయించడం, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం వంటి అంశాలపై మంత్రి చేసిన ప్రకటన ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం సాధనలో అనేక మంది యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. వారి కుటుంబాల సంక్షేమం ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా ఉంటాయని, త్వరితగతిన అమలు చేయాలని పెద్దగోని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

ఉద్యమకారుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది – పెద్దగోని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News