జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలి.. ఇరిగేషన్ అధికారులకు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశాలు.
బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలువ పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు జరిగిన పురోగతిని సీఈ, ఎస్ఈ, ఈఈ, డీఈ తదితర అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఎలాంటి జాప్యానికి తావులేకుండా పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, రైతులకు సాగునీరు అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి