హయత్‌నగర్, అక్టోబర్ 29 (స్థానికం): బంజారా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా కేర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
హయత్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆస్పత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు. స్థానికంగానే మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం పొందేందుకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆస్పత్రి కీలక పాత్ర పోషించాలని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధిస్తూ నాణ్యమైన వైద్య సేవలతో మంచి పేరు సంపాదించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో జీవన్ అన్న మిత్రబృందం సభ్యులు పాండల శ్రీధర్, బద్దం రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు జంజ్య నాయక్, బాలు నాయక్‌తో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి