Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కిషన్ మహారాజా అవార్డుకు సూర్యాపేట జిల్లా రైతు మూల వెంకటరెడ్డి ఎంపిక

Updated : 29 Oct 2026 20:30 IST
As Preferred Source 1 min read
కిషన్ మహారాజా అవార్డుకు సూర్యాపేట జిల్లా రైతు మూల వెంకటరెడ్డి ఎంపిక

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న మూల వెంకటరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది.గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన ఆయనను కిషన్ మహారాజా 2026 అవార్డులలో భాగంగా జిల్లా ఆదర్శ రైతుగా ఎంపిక చేశారు.హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న శిల్పకళా వేదికలో వైస్ టీవీ డిజిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిషన్ మహారాజా 2026 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎంపికైన ఆదర్శ రైతులకు అవార్డులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు,కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి,వైస్ టీవీ యాంకర్ రాములమ్మ హాజరయ్యారు.వారి చేతుల మీదుగా మూల వెంకటరెడ్డి అవార్డును అందుకున్నారు.అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. వ్యవసాయ రంగంలో అంకితభావంతో పనిచేస్తూ,ఆధునిక సాగు పద్ధతులను అనుసరిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న వెంకటరెడ్డి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.ఆయనకు జిల్లా ఆదర్శ రైతు అవార్డు లభించడంపై నారాయణగూడెం గ్రామ ప్రజలు, తోటి రైతులు,బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ అవార్డు తమ గ్రామానికి గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

కిషన్ మహారాజా అవార్డుకు సూర్యాపేట జిల్లా రైతు మూల వెంకటరెడ్డి ఎంపిక

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి