చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
చౌటుప్పల్ టౌన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ రెడ్డిని గురువారం కంచరకుంట్ల కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కాలనీ నాయకులు సీఐని కోరారు. ఈ కార్యక్రమంలో కంచరకుంట్ల కాలనీ అధ్యక్షుడు కోనేటి నరసింహ, నాయకులు చెరుకు వెంకటేష్, కంచరకుంట్ల శశిధర్ రెడ్డి, అప్పిడి కృష్ణా రెడ్డి, రాపోలు లక్ష్మీనారాయణ, బోడ హరికిషన్, పిల్లి వెంకట్ రెడ్డి, కటాబత్తిని శ్రీనివాస్ కాలనీవాసులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి