నాగోల్; అక్టోబర్, 29 ( స్థానికం)
జహీరాబాద్ నుంచి వలసవచ్చి, నాగోల్-తట్టి అన్నారం క్రాస్‌రోడ్ వద్ద షెడ్డు ఏర్పాటు చేసిన శిల్పి రవీంద్ర చారి తన కళా నైపుణ్యంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. 30-40 మందికి ఉపాధి కల్పిస్తూ వారు చేస్తున్న శిల్పాలు కనువిందు చేస్తున్నాయి.యాదాద్రి దేవాలయంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టాలు, తిరుమల TTD ఎస్.వి. మ్యూజియం ప్రదర్శన, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎలివేషన్ శిల్పాలనుఅత్యద్భుతంగా తీర్చిదిద్దారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రశంసలు అందుకున్న రవీంద్ర చారి, తెలుగు రాష్ట్రాల సంస్కృతిని శిల్పాల రూపంలో సజీవంగా నిలుపుతున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి