రానున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోదాడ నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకుడు తిప్పన విజయసింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం
మునగాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులను గుర్తించి, నవంబర్ 6లోగా ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యావంతులను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి