పాత తొట్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి: జీఎంపీస్ జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నందున, గొర్రెలు, మేకలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో కొత్తగా నీటి తొట్లు ఏర్పాటు చేయడంతో పాటు పాత తొట్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.గురువారం చౌటుప్పల్ మండల కేంద్రంలో జరిగిన జీఎంపీఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల, కురుమ కుటుంబాలకు తాగునీటి కొరత పెద్ద సమస్యగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులతో నీటి వనరులు ఎండిపోతే జీవాల ఆరోగ్యం దెబ్బతిని పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, అధికారులు సమన్వయంతో పనిచేసి జీవాలకు నీటి తొట్లు నిర్మించాలని, వాటిలో పరిశుభ్రమైన నీరు ఉండేలా చూడాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక నిధులు కేటాయించి పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఈ సమావేశంలో సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా డైరెక్టర్లు గౌరవ అధ్యక్షుడు బండారు నర్సింహ్మ,కల్లూరి మల్లేశం, జిల్లా కార్యదర్శి,రాష్ట్ర కమిటీ సభ్యుడు దయ్యాల నర్సింహ్మ,కొండె శ్రీశైలం,జిల్లా కమిటీ సభ్యులు గునమోని అయిలయ్య,బీమగోని బాలరాజు,పాక జహాంగీర్, గాజుల అంజయ్య,జెనిగల యాదయ్య,శెట్టయ్య,విష్ణు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి