Sthanikam - Truth Matters
Logo

38 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు

Updated : 29 Oct 2026 17:01 IST
As Preferred Source 1 min read
38 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు

వరుసగా రెండో ఏడాది విద్యార్థులకు అండగా సంజయ్ దాస్ గౌడ్.

చిట్యాల: పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 38 మంది విద్యార్థుల పరీక్ష ఫీజును తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ చెల్లించారు. వరుసగా రెండో ఏడాది విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదివి, కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలనే ఉద్దేశంతో ఫీజు చెల్లించినట్లు తెలిపారు.

ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల, ఉపాధ్యాయ బృందం సంజయ్ దాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ టి.జి. లింగం గౌడ్, మంద వేణుగోపాల్ రెడ్డి, జోగు లింగస్వామి, బత్తుల నాగరాజు గౌడ్, ఉపాధ్యాయులు, ఇతరులు పాల్గొన్నారు.

Sthanikam

38 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news