Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ రెడ్డి

Updated : 29 Oct 2026 17:01 IST
As Preferred Source 1 min read
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ రెడ్డి


​జై కేసారం జెడ్పీహెచ్‌ఎస్‌లో సైబర్ క్రైమ్, మహిళా భద్రతపై అవగాహన సదస్సు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ డి. సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జై కేసారం గ్రామ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆయన ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, మహిళల భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.​ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రస్తుత కాలంలో జరుగుతున్న వివిధ సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియాను సురక్షితంగా ఏవిధంగా ఉపయోగించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు నివారణ చర్యలను ఉదాహరణలతో వివరించారు.​అలాగే, మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ చర్యలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ రెడ్డి

Article Image


​జై కేసారం జెడ్పీహెచ్‌ఎస్‌లో సైబర్ క్రైమ్, మహిళా భద్రతపై అవగాహన సదస్సు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ డి. సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జై కేసారం గ్రామ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆయన ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, మహిళల భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.​ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రస్తుత కాలంలో జరుగుతున్న వివిధ సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియాను సురక్షితంగా ఏవిధంగా ఉపయోగించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు నివారణ చర్యలను ఉదాహరణలతో వివరించారు.​అలాగే, మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ చర్యలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news