నెల్లిబండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం.
నల్గొండ: నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో దసరా వేడుకల సందర్భంగా తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మి చెట్టు వద్ద నిర్వహించిన దసరా ఉత్సవాల్లో బీఆర్ఎస్ నాయకుడు సోమయ్య తుపాకీతో కాల్పులు జరిపి, ఫొటోలకు ఫోజులిచ్చినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. చట్టవిరుద్ధంగా తుపాకీతో కాల్పులు జరిపినందుకు సోమయ్యపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆయన వద్ద ఉన్న తుపాకీతో పాటు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దసరా పండుగ వేడుకల సందర్భంగా బహిరంగంగా తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి