Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

జాతీయ ఐక్యతా వేడుకలకు తాజ్‌పూర్‌ సర్పంచ్‌ దంపతులకు ఆహ్వానం

Updated : 29 Oct 2026 10:55 IST
As Preferred Source 1 min read
జాతీయ ఐక్యతా వేడుకలకు తాజ్‌పూర్‌ సర్పంచ్‌ దంపతులకు ఆహ్వానం

గుజరాత్‌లో అక్టోబర్‌ 31న నిర్వహణ జిల్లా నుంచి ఐదుగురు సర్పంచ్‌ల ఎంపిక.. వారిలో ర్యాకల సంతోష శ్రీనివాస్‌.

సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లో అక్టోబర్‌ 31న నిర్వహించనున్న జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్‌) వేడుకలకు తాజ్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ ర్యాకల సంతోష శ్రీనివాస్‌ దంపతులకు ప్రత్యేక ఆహ్వానం అందింది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఎంపికైన ఐదుగురు సర్పంచ్‌లలో ఆయనకు చోటు దక్కింది.

జాతీయ స్థాయి వేడుకల్లో..

దేశ సమగ్రత, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించడంపై తాజ్‌పూర్‌ గ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది.

గ్రామానికి దక్కిన గుర్తింపు

ఈ సందర్భంగా సర్పంచ్‌ ర్యాకల సంతోష శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. జాతీయ ఐక్యత, దేశ సమగ్రత, భద్రత వంటి గొప్ప ఆశయాలతో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానం అందడం గర్వంగా ఉందన్నారు. ఈ అవకాశం తాజ్‌పూర్‌ గ్రామానికి దక్కిన ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు.

జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని గ్రామానికి గుర్తింపు తీసుకురావడంతోపాటు, తాజ్‌పూర్‌ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

జాతీయ ఐక్యతా వేడుకలకు తాజ్‌పూర్‌ సర్పంచ్‌ దంపతులకు ఆహ్వానం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి