Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కరాటేలో బంగారు పతకం.. రాష్ట్ర స్థాయికి మాంటెస్సరి విద్యార్థి!. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన మొహమ్మద్‌ అయ్యానుద్దీన్‌.

Updated : 29 Oct 2026 12:47 IST
As Preferred Source 1 min read
కరాటేలో బంగారు పతకం.. రాష్ట్ర స్థాయికి మాంటెస్సరి విద్యార్థి!.  జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన మొహమ్మద్‌ అయ్యానుద్దీన్‌.

భువనగిరి:

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ కరాటే పోటీల్లో మాంటెస్సరి పాఠశాల విద్యార్థి మొహమ్మద్‌ అయ్యానుద్దీన్‌ ప్రతిభ చాటాడు. అండర్‌–14 విభాగంలో పోటీపడి బంగారు పతకం సాధించడంతోపాటు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

ప్రతిభకు దక్కిన గుర్తింపు

చిన్న వయస్సులోనే జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు అన్నారు. అయ్యానుద్దీన్‌ విజయం అతని కృషి, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా పాఠశాల తరఫున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

అభినందనల వెల్లువ

విద్యార్థి సాధించిన విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు, యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అయ్యానుద్దీన్‌ను అభినందించారు. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకం సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి