సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.
రామన్నపేట, అక్టోబర్ 29 (స్థానికం):
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం రామన్నపేటలో నిర్వహించిన 2కే రన్‌ను ఆయన ప్రారంభించారు.
ఉదయం 7 గంటలకు సుభాష్ చంద్రబోస్ సెంటర్ నుంచి కోర్టు వరకు 2కే రన్ నిర్వహించారు. అనంతరం సుభాస్ సెంటర్ లో కార్యక్రమంలోఎస్పీ మాట్లాడుతూ . మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి జీవితంతోపాటు కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్పీ పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.
ఓటీపీ, పాస్వర్డ్లు చెప్పొద్దు.
సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన
రామన్నపేట ఎస్ఐ గోపాతి సతీష్ ఆధ్వర్యంలో, సీఐ మెలుగు రవి సహకారంతో, డీఎస్పీ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల రహిత సమాజం, సైబర్ నేరాలు లేని సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు,వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, ఆత్మకూరు ఎస్ ఐ లక్ష్మీనారాయణ,మోత్కూర్ ఎస్ ఐ సతీష్, అడ్డగూడూరు ఎస్ ఐ వెంకట్ రెడ్డి,ఏయస్ ఐ సురేందర్,హెడ్ కానిస్టేబుల్ కమలాకర్ వెంకటేశ్వర్లు,సిబ్బంది లింగస్వామి స్వామి నాయక్ ప్రవీణ్ ప్రశాంత్ స్వామి. మధు, కృష్ణమూర్తి,నరసింహ, లావణ్య,కవిత,సైదులు, సైదయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి, జగదీశ్వర్, వెంకటరెడ్డి, వి నరసింహారావు, నగేష్, పున్నారావు, అశోక్, రాజేశ్వరి, ఉమారాణి,నాయకులు జల్ల వెంకటేశం, వనం చంద్రశేఖర్, ఎండి జమురుద్దీన్,కోట సుధాకర్, కందుల హనుమంతు, కొమ్ము శేఖర్,లింగస్వామి,అబ్దుల్ వహీద్ అంజాద్, భావాండ్లపల్లి బాలరాజు గౌడ్, సోమా నరసింహ చారి, మెటే మహేష్, తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి