మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి కోదాడ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. మరో ఆరుగురికి రూ.2,000 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై మల్లు సంజీవరెడ్డి బుధవారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27న తాడువాయి గ్రామ స్టేజీ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎనిమిది మంది వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. దీంతో వారిని బుధవారం కోదాడ కోర్టులో హాజరుపరచగా, ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా విధించగా, మిగతా ఆరుగురికి జరిమానా విధించినట్లు ఎస్సై వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి