Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అమ్మ నాన్న ఆశ్రమంలో అనారోగ్యంతో వృద్ధురాలు మృతి

Updated : 28 Oct 2026 18:06 IST
As Preferred Source 1 min read
అమ్మ నాన్న ఆశ్రమంలో అనారోగ్యంతో వృద్ధురాలు మృతి

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

తాళ్లసింగారం గ్రామంలో ఉన్న ‘అమ్మ నాన్న’ అనాథ ఆశ్రమంలో వెంకట రమణమ్మ (76) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి. సతీష్ రెడ్డి తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా సంక్షేమ అధికారి గతంలో వెంకట రమణమ్మను రక్షించి, సంరక్షణ నిమిత్తం తాళ్లసింగారంలోని అమ్మ నాన్న అనాథ ఆశ్రమానికి తరలించారు. గత ఏడాది కాలంగా ఆమె ఈ ఆశ్రమంలోనే నివాసముంటున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో మృతి చెందారు.​ఈ విషయమై ఆశ్రమ ఉపాధ్యక్షుడు సారిపల్లి గణేష్ (37, తండ్రి: శంకరయ్య) ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Sthanikam

అమ్మ నాన్న ఆశ్రమంలో అనారోగ్యంతో వృద్ధురాలు మృతి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news