డాన్ బాస్కో స్కూల్‌లో న్యాయ అవగాహన సదస్సు 400 మంది విద్యార్థులకు సూచనలు చేసిన జడ్జి రత్నకుమారి.
రామన్నపేట, అక్టోబర్ 28 స్థానికం ప్రతినిధి :
ఆన్‌లైన్ మోసాలు, సైబర్ వేధింపుల బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని రామన్నపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి సూచించారు. సురక్షిత్ బచ్‌పన్ అభియాన్‌లో భాగంగా రామన్నపేటలోని డాన్ బాస్కో హైస్కూల్‌లో బుధవారం ‘సురక్షిత్ క్లిక్–సురక్షిత్ బచ్‌పన్’ అంశంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.
ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని జడ్జి సూచించారు. అపరిచితులతో ఆన్‌లైన్‌లో సంభాషించవద్దని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. ఆన్‌లైన్‌లో బెదిరింపులు, వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని, అవసరమైతే పోలీసులను సంప్రదించి న్యాయ సహాయం పొందాలని సూచించారు.
కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ కునూరు శ్రీనివాస్, పారా లీగల్ వాలంటీర్ కె. యాదయ్య, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యుడు కె. శ్రీశైలం, పాఠశాల ప్రిన్సిపాల్ చిట్టిబాబు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి