వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని బీఆర్‌ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా ఇన్‌చార్జీలను నియమించి, అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.
బుధవారం భువనగిరిలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సమన్వయంతో పనిచేసి నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి కర్నె ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి