గ్రామ పంచాయతీ నిధులతో మరమ్మతులు | ప్రారంభించిన సర్పంచ్ నిరంజన్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
మల్కాపురం గ్రామంలో దెబ్బతిన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని గ్రామ పంచాయతీ నిధులతో పునరుద్ధరించినట్లు సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ తెలిపారు. బుధవారం పునరుద్ధరించిన అంగన్‌వాడీ భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నారులకు, గర్భిణులకు మెరుగైన వాతావరణంలో అంగన్‌వాడీ సేవలు అందించేందుకే పంచాయతీ నిధులను వెచ్చించి త్వరితగతిన మరమ్మతు పనులు పూర్తి చేయించినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుంకరి విజయ్‌కుమార్ గౌడ్, పొట్లపల్లి శివశంకర్ గౌడ్, సంగెం రవితేజ, ఒంటెడు రాజు, కొత్త మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి