Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం

Updated : 28 Oct 2026 20:02 IST
As Preferred Source 1 min read
నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం

నారాయణఖేడ్ పట్టణంలోని వారాహి బ్యాంకెట్ హాల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియ గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటరు జాబితాలో ఉన్న అనర్హమైన, అక్రమ ఓట్లను గుర్తించి తొలగించడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అయితే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విమర్శలు చేస్తోందని ఆరోపించారు. ఓటరు జాబితాలను ప్రక్షాళన చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరిగి, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మేధావులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news