రామన్నపేటలో 2కే రన్.. పాల్గొన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు..
రామన్నపేట, అక్టోబర్ 29, స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి నల్లగొండ రోడ్డు వైపు సాగిన 2కే రన్‌లో జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పున్నారావు, మాలె వెంకట్‌రెడ్డి, నరసింహారావు, అశోక్‌కుమార్, నగేష్, రాజేశ్వరి, ఉమారాణితోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి