Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు: సీపీ బి. సుమతి.

Updated : 29 Oct 2026 21:53 IST
As Preferred Source 1 min read
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు: సీపీ బి. సుమతి.

కల్తీ ఎరువుల దందాపై ఉక్కుపాదం.

ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్‌.. 164.375 టన్నుల నకిలీ ఎరువులు స్వాధీనం.

మల్కాజిగిరి, అక్టోబర్‌ 29 స్థానికం ప్రతినిధి:

కల్తీ ఎరువుల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులపై మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి, ఐపీఎస్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. చెరుపల్లి రవి, రొడావత్‌ మంగ్తా నాయక్‌ అలియాస్‌ దాది మంగ్తా అలియాస్‌ మణిపై ఈ నెల 26న నిర్బంధ చట్టాన్ని అమలు చేశారు. అనంతరం వారిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు పోలీస్‌ కమిషనరేట్‌ మీడియా సెల్‌ వెల్లడించింది.

హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిందితులు నకిలీ, కల్తీ ఎరువులను అక్రమంగా తయారు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ కంపెనీలకు చెందిన అసలైన ఎరువులుగా నమ్మించి రైతులకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 1,64,375 కిలోల (164.375 మెట్రిక్‌ టన్నుల) నకిలీ, కల్తీ ఎరువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.నిందితుల కార్యకలాపాల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకతపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. రైతాంగానికి కలిగే ముప్పును, అక్రమ కార్యకలాపాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు వివరించారు.నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులను తయారు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం ద్వారా రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ బి. సుమతి హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, రైతులను మోసాల నుంచి రక్షించేందుకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు: సీపీ బి. సుమతి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి